||ప|| నిన్నే తలచి తలచి, నీ చిరునవ్వులకే మురిసి,
నీ కోసం, ఆలోచిస్తూ వర్షం లో తడిసి,
నీకై ఎదురు చూసి, నను నేనే మైమరిచి,
నీవంటూ లేకుంటే, నేనే లేనని తెలిసి,
అలిసీ ... సొలసి ...
||చ౧|| చిటపట చినుకుల తాళం లో రాగాలెన్నో వెరసి ...
వేరసిన రాగం నా గుండెల్లో, నీపై ప్రేమని తెలిపి,
కనుల ఎదురుగ లేకున్నా, నిను చూస్తున్నట్టనిపిస్తే ...
కలలో కూడా నీ రూపం నను వెంటాడుతూ ఉంటే ,
గుండెలోన దాగి ఉన్నది ... చెప్పుకోలేని భావం ఒకటి ...
జీవించాలి ... నీతో కలిసి ... ||నిన్నే తలచి ... సొలసి||
||చ౨|| ఎందుకో ఏమిటో తెలియనీ కలవరం ...
మునుపు ఎప్పుడూ లేదులే నాలో ఈ పరవశం,
ఈ క్షణం, అనుక్షణం, నిరీక్షణ నీ కోసం ...
ఓ చెలి! తెలుపవే ... నీకెందుకీ మౌనం,
ఈ ప్రాణం కాదు శాశ్వతం ... నేను కోరేది నీ సంతోషం ...
ఈ గానం ... నీకు అంకితం ... || నిన్నే తలచి ... సొలసి||
1 comment:
Nice ra....I enjoyed it thoroughly....Manishannaka kastha kalaposhana undali ani nirupinchavu...Keep rockin :)
Post a Comment